calender_icon.png 18 October, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకి బీజేపీ విధానాలు నశించాలి

18-10-2025 05:03:16 PM

సత్య ప్రసాద్..

ఉప్పల్ (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకి బీజేపీ విధానాలు నశించాలని ఏఐవైఎఫ్ మేడ్చల్ అధ్యక్షుడు సత్య ప్రసాద్ అన్నారు. బీసీ సంఘాలు తలపెట్టిన రాష్ట్ర బంద్ ను భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ), అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్), అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్)  కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మల్లాపూర్ కూడలి వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం సత్య ప్రసాద్ మాట్లాడుతూ ప్రజా కోర్టులో బీజేపీని నిలబెట్టి బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారానే రిజర్వేషన్ల అమలు సాధ్యమని, బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకి బీజేపీ విధానాలు నశించాలని డిమాండ్ చేశారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు జరిగితే బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృధి చెందుతారని ఉద్దేశంతో కొందరు బీసీ రిజర్వేషన్ ను కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు అసలు అడ్డుకునే వారు ఎవరని వారు ప్రశ్నించారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా మొత్తం జనాభాల 50% పైన ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు అవకాశాలు కల్పించడం లేదని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో  సీపీఐ, ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ నేతలు గిరి బాబు, రాజ్ కుమార్, మహేష్, విజయ్, అజీమ్ పాషా, వికాస్ రెడ్డి, సురేష్, ఇంతియాజ్, సల్మాన్, బన్నీ,రియాన్, ఆరాన్, వుదీప్, చందు, ఆతిఫ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.