calender_icon.png 18 October, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంజీవ్ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది..

18-10-2025 05:05:28 PM

గండు సంజీవ్ మరణం కాంగ్రెస్ పార్టీకీ తీరని లోటు

అంతిమయాత్రలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి (విజయక్రాంతి): జూలపల్లి మండల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గండు సంజీవ్ సంజీవ్ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావులు అన్నారు.  శుక్రవారం హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో సంజీవ్ మృతిచెందాడు. శనివారం జూలపల్లి మండలం కాచపూర్ గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి వారి వారు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను కలిసి తమ ప్రగాఢ సానుభూతి సంతాపన్ని మంత్రి, ఎమ్మెల్యే  తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గండు సంజీవ్ మరణం కాంగ్రెస్ పార్టీకీ తీరని లోటని అవేదన వ్యక్తం చేశారు. సంజీవ్ అంతిమ యాత్రలో పాల్గొని మంత్రి, ఎమ్మెల్యే పాడే మోశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, డైరక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.