18-10-2025 04:59:27 PM
బీసీల గురించి బిజెపి పట్టించుకోవడం లేదు
ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
బీసీ బంద్ కు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ
నల్లగొండ టౌన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. బీసీ బంద్ కు మద్దతుగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి పట్టణంలో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ దేశంలో మార్పు కోసం మేమెంతో మాకు అంత అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేసిందని అన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించి గవర్నర్ కు పంపించడం జరిగిందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు బిజెపి మొదటి నుంచి మోకాలడ్డుతుందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై న్యాయస్థానాలలో చుక్కెదురైందని ఆవేదన వ్యక్తం చేశారు.
అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీసీల 42 శాతం రిజర్వేషన్ కు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలకు న్యాయం చేసే విధంగా కృషి చేశాడని తెలిపారు.ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీని అమలు చేస్తుందని అన్నారు.నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
బీసీల గురించి బిజెపి పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీసీ బంద్ కు సహకరించిన విద్యా, వ్యాపార సంస్థలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పున్న కైలాస నేత, మాజీ కౌన్సిలర్లు జూలకంటి శ్రీనివాస్, గడిగ శ్రీనివాస్, బొజ్జ శంకర్, దుబ్బ అశోక్ సుందర్, కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల కోటి, అల్లి సుభాష్ యాదవ్, గురిజ వెంకన్న గౌడ్, మామిడి కార్తీక్, గాలి నాగరాజు, జహంగీర్ బాబా, మహమ్మద్, కంచర్ల ఆనంద్ రెడ్డి, పాదం అనిల్, పోలే జయ కుమార్, పరశురాం, కె.వి.ఆర్ సతీష్, దాసరి విజయ్, గోపాల్,వంశీ, రాజు, బిలాల్, జానీ తదితరులు పాల్గొన్నారు.