జిల్లా వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు నిరసన
12-08-2026 09:49 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): USPC రెండవ దశ కార్యాచరణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆయా మండల కేంద్రంలో ఉపాధ్యాయులు ధరించి నిరసన తెలిపారు. జిల్లాలోని ఖానాపూర్ , లక్ష్మణ చందా, మామడ, దిల్వార్పూర్, సోన్ సారంగాపూర్ నర్సాపూర్, భైంసా మండలాల్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో TS యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట అశోక్..DTF జిల్లా అధ్యక్షుడు మహేంద్ర చారి, బాలాజీ TSUTF లక్ష్మణ చందా మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి సాయన్న, UTF జిల్లా నాయకులు వినోద్ కుమార్ బాపిరెడ్డి నారాయణ వర్మ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






