13 August, 2026 | 2:05 PM

సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ

12-08-2026 10:00 PM

బెజ్జంకి,(విజయక్రాంతి): నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని అదనపు డీసీపీ కుషాల్కర్ అన్నారు. సురక్షా నేత్ర కార్యక్రమంలో భాగంగా బెజ్జంకి మండలం చిలాపూర్ గ్రామంలో సర్పంచ్ శారద ఆధ్వర్యంలో గ్రామ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను బుధవారం అదనపు డీసీపీ కుషాల్కర్, సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్‌తో కలిసి ప్రారంభించారు.

సీసీ కెమెరాల నిఘాతో నేరాలను ముందుగానే అరికట్టడంతో పాటు నిందితులను గుర్తించడం సులభమవుతుందని అదనపు డీసీపీ తెలిపారు. గ్రామాల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామ ప్రజలు, ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులకు ఎస్‌ఐ తోట తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.