calender_icon.png 14 August, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశీర్వదించండి

11-08-2025 01:16:09 AM

  1. బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలపండి 

ప్రజల సంక్షేమం అభివృద్ధి మా ఎజెండా 

ఎంపీ డీకే అరుణ

దేవరకద్ర ఆగస్టు 10 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను ఆశీర్వదించాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం వెంకటాయపల్లిలో గ్రామంలోని రంగనాయక స్వామి ముఖ ద్వారాన్ని స్థానిక బీజేపీ నేతలతో కలిసి ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన అనంతరం ఎంపీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభు త్వం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. మాయమాటలు చెప్పే వారి దూరం పెట్టాలని అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్న బిజెపికి మద్దతు తెలిపాలని పేర్కొన్నారు. గ్రామ సమ స్యలతో కూడిన వినతి పత్రాన్ని గ్రామస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, గ్రామ ప్రజలు ఉన్నారు.