11-08-2025 01:14:49 AM
వ్యవసాయ అధికారి జాస్మిన్
కొత్తకోట ఆగస్టు 10 : జూన్ 5 తేదీ వరకు పట్టాపాస్ బుక్ వచ్చిన వారందరు రైతు భీమాకు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి జాస్మిన్ అన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ రైతు భీమాకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 13 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భీమా కోసం మరోసారి అవకాశం కల్పించిందని తెలిపారు.
ఇది వరకు కూడా దరఖాస్తు చేసుకొని రైతులు కూడా ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 18 సంవత్సరాలు నుండి 59 ఏండ్ల లోపు ఉన్న వారు భీమా చేసుకోవడానికి అర్హులు అని అన్నారు. ఆగస్టు 14 1966 నుండి ఆగస్టు 14 2007 మధ్యలో పుట్టిన రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
ఇది వరకు రైతు భీమాకు దరఖాస్తు చేసుకున్నవారిలో నామిని చనిపోయిన, పట్టాదారు పేరు, నామిని పేరు తప్పుపడిన, వాటి సవరణకు ఈ నెల 12 వరకు అవకాశం ఉందని మండల వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఇది వరకు రైతు భీమా కు దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. మండలంలోని ఆయా గ్రామంలో ఉన్న రైతులు ఏఈఓ ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.