calender_icon.png 13 August, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలి

11-08-2025 01:17:21 AM

అలంపూర్ ,ఆగస్టు 10 : జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని కాబట్టి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు.

రాష్ట్ర బిజెపి పార్టీ,ఎంపీ డీకే అరుణ ఆదేశాల మేరకు ఆదివారం మానవపాడు మండల కేంద్రంలో స్థానిక బిజెపి నాయకులు ఏర్పాటుచేసిన బైక్ ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ భద్రత విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నారని అందులో భాగంగానే త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారన్నారు.

గతంలో కొందరు ముఖ్య నేతలు,అధికారులు మాత్రమే జాతీయ జెండాను ఎగురవేసేవారని ఇప్పుడు దేశ పౌరులందరికీ జాతీయ జెండా ఎగురవేసే అవకాశం ప్రధాని మోడీ కల్పించారని తెలిపారు.హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేసి దేశభక్తి చాటుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ శర్మ, మండల బిజెపి అధ్యక్షులు మురళీకృష్ణ,నాగేశ్వర్ రెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణ రాఘవయ్య,కురుమన్న, వెంకటేష్ రామాంజనేయులు ,తిమ్మప్ప మదన్మోహన్ ,నాగరాజు ,పిడుగు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.