23 June, 2026 | 2:33 AM

సింధు హాస్పిటల్స్‌లో రక్తదాన శిబిరం

23-06-2026 12:13 AM

ఒక్క రోజులోనే వెయ్యి యూనిట్ల సేకరణ

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): ప్రజల్లో రక్తదానంపై అవగాహన పెంచేందు కు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త నిల్వల కొరతను తీర్చేందుకు హైదరాబాద్ హైటెక్ సిటీ లోని సింధు హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జూన్ 20న మెగా రక్తదాన శిబిరం విజయవంతం గా జరిగింది. కేవలం ఒక్క రోజులోనే వెయ్యి యూనిట్ల రక్తాన్ని సేకరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సింధు హా స్పిటల్స్, హెటెరో గ్రూప్ ఉద్యోగులతో పాటు స్వచ్ఛంద సేవకులు, ప్రజలు ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సేకరించిన రక్తాన్ని ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్స్ వంటి ప్రముఖ ప్రభు త్వ ఆసుపత్రులకు అందజేశారు. క్యాన్సర్ రోగులు, తలసీమియా బాధితులు, రోడ్డు ప్రమాదాల క్షతగాత్రుల అత్యవసర చికిత్సలకు ఈ నిల్వలు ఎంతో ఉపయోగపడను న్నాయి. డాక్టర్ బి. పార్థసారథి రెడ్డి (సింధు హాస్పిటల్స్ చైర్మన్, హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్పర్సన్) నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్. శ్రీనివాస్ రెడ్డి (హెటె రో హెల్త్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్) ఈ రక్తదాన డ్రైవ్‌ను ప్రారంభించారు.