23 June, 2026 | 2:30 AM

7 ఏళ్ల చిన్నారికి వైద్యుల పునర్జన్మ

23-06-2026 12:12 AM

‘మెడికవర్’లె అరుదైన లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స 

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): అరుదైన కాలేయ సంబంధిత రక్తనాళాల వ్యాధితో బాధపడుతూ, 7 ఏళ్ల వయసులో నూ 5 ఏళ్ల బాలుడిలా కనిపిస్తూ ఎదుగుదల లోపించిన కొత్తూరుకు చెందిన చిన్నారి యశ్వంత్‌కు హైదరాబాద్‌లోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు నూ తన జీవితాన్ని అందించారు. బాలుడి పొత్తికడుపులో సాధారణ పరిమాణం కంటే ఎన్నో రెట్లు పెరిగి 17 సెంటీమీటర్లకు చేరుకున్న ప్లీహాన్ని అత్యంత క్లిష్టమైన ’లాపరో స్కోపిక్ స్ప్లీనెక్టమీ’ శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు.

తీవ్ర రక్తహీనత (6 గ్రాముల హిమోగ్లోబిన్), పోర్టల్ హైపర్టెన్ష న్, పరిమిత ఆపరేటివ్ స్థలం వంటి అనేక సవాళ్లు ఉన్నప్పటికీ.. ఓపెన్ సర్జరీ అవసరం లేకుండా అత్యాధునిక మినిమల్లి ఇన్వాసివ్ టెక్నాలజీతో మల్టీడిసిప్లినరీ నిపుణుల బృం దం ఈ సర్జరీని పూర్తి చేసింది. ప్రస్తుతం చి న్నారి వేగంగా కోలుకుంటున్నాడని, రాబో యే రోజుల్లో అతని శారీరక ఎదుగుదల, ఆరోగ్యం మెరుగుపడతాయని వైద్యులు వెల్లడించారు. చికిత్స అందించిన వైద్య బృందం లో డా. కిశోర్ రెడ్డి (లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్), డా. మధుమోహన్ రెడ్డి (సీనియర్ పీడియాట్రిక్ సర్జన్), డా. జనార్ధన్ రెడ్డి (పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్), డా. గౌరీ శంకర్ (చీఫ్ అనస్థీషియాలజిస్ట్) ఉన్నారు.