20 May, 2026 | 6:15 PM

కొత్తపల్లి రైల్వే గేట్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం

20-05-2026 05:14 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కొత్తపల్లి రైల్వే గేట్ వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. తాండూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి పంచాయతీ సెక్రటరీ కి ఉదయం 9 గంటలకు కొత్తపల్లి గ్రామ కరోబార్ కాల్ చేసి కొత్తపల్లి రైల్వే గేట్ సమీపంలో ఒక మగ వ్యక్తి మృతదేహం ఉందనీ చెప్పారు. వెంటనే అతను సంఘటన స్థలానికి వెళ్ళి చూడగా, ఒక మగ వ్యక్తి రైల్వే లైన్ పక్కన ఉన్న సిమెంట్ గోడ పక్కన చనిపోయి కనిపించాడు.

మృతిపై అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర పనిచేస్తున్న వారిని ఆరా తీశారు. మృతుడు మంగళవారం ఉదయం 0900 గంటలకు రైల్వే ట్రాక్ మీద పిచ్చి పిచ్చిగా తిరుగుతూ కనిపించినట్టు కొత్తపల్లి గేట్ మ్యాన్ చెప్పారు. అక్కడ నుంచి  పక్కనే పనిచేస్తున్న వాళ్ళ దగ్గరకి కూడా వెళ్ళి మంచి నీళ్ళు తాగి వెళ్ళిపోయాడు. కొద్ది సేపటికి ఒంటి మీద బట్టలు లేకుండా ఒక డ్రాయర్ మీదనే వచ్చి ట్రాక్ మీద పిచ్చి పిచ్చిగా తిరుగుతూ కనిపించాడు.

ఇదే క్రమంలో పక్కనే ఉన్న మామిడి తోటలోకి వెళ్ళి అక్కడ నుంచి వచ్చి ట్రాక్ పక్కన ఉన్న పొలం నుంచి రైల్వే ట్రాక్ మీదకు దూకగా  ప్రమావశత్తు కింద పడి చనిపోయాడని చెప్పారు. మృతుడు అంతకు ముందు గ్రే కలర్ టి షర్ట్  నలుపు రంగు పాంట్ ధరించి ఉన్నాడునీ తెలిపారు. మృతుని ఫొటోని చూసి గుర్తుపట్టినట్లు అయితే ఈ కింది నెంబర్ ను సంప్రదించాలని   8712656575  తాండూరు ఎస్ఐ కోరారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.