22 May, 2026 | 10:48 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

22-05-2026 09:57 AM

సిద్దిపేట (విజయక్రాంతి): కారు వేగం అదుపుతప్పి రోడ్డు పక్కన గల రాతీ కడ్డీలను ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండలం తిప్పారం గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. తిప్పారం గ్రామానికి చెందిన బుర్ర ప్రశాంత్ గౌడ్ 40 మరో ఇద్దరు కలిసి కుకునూరుపల్లి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రశాంత్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు.