16 July, 2026 | 12:42 PM

విశ్వంభరలో బాలీవుడ్ నటుడు

15-06-2024 12:29 AM

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో స్టార్ హీరోయిన్లు త్రిష, ఆషికా భాగస్వామ్యం కాగా, ఓ బాలీవుడ్ నటుడు కూడా తారాగణం జాబితాలో చేరినట్టు చిత్రబృందం తాజా ప్రకటన చేసింది. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ‘విశ్వంభర’ టీమ్‌లో జాయిన్ అయిన విషయాన్ని వెల్లడిస్తూ దర్శకుడు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. కునాల్ ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ సీక్వెన్స్ భారీ స్థాయిలో ఉండనున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కునాల్ కపూర్ తారాగణంలో భాగస్వామ్యం కావటం విశేషం. జూలై నెలాఖరుకల్లా చిత్రీకరణ పూర్తి చేయాలనేది మేకర్స్ లక్ష్యం కాగా, ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్నది.