16 July, 2026 | 1:00 PM

నీరా వాసుదేవ్‌గా..

15-06-2024 12:25 AM

నితిన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘రాబిన్‌హుడ్’. శ్రీలీల కథానాయిక. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్నది. శుక్రవారం శ్రీలీల పుట్టిన రోజును పురస్కరించుకొని చిత్రబృందం సినిమాలోని ఆమె పాత్రను పరిచయం చేసింది. లేడీ బాస్ నీరా వాసుదేవ్‌గా పేర్కొంటూ ఆకర్షణీయమైన ఫొటోను విడుదల చేశారు. చుట్టూ భారీ సెక్యూరిటీతో ప్రైవేట్ జెట్‌లో దిగినట్టు ఉన్న ఈ ఫొటో ఆకట్టుకుంటున్నది. ఈ సినిమాలో శ్రీలీల పాత్ర, నితిన్ పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుందని చిత్రవర్గాలు తెలిపాయి. ఇంకా ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న విడుదల కానున్నది.