15 July, 2026 | 3:45 AM

వరల్డ్ కప్ అంబాసిడర్‌గా బోల్ట్

25-04-2024 12:39 AM

దుబాయ్: ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం.. దిగ్గజ స్ప్రింటర్ ఉసెన్ బోల్ట్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. జూన్ 1 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగనున్న మెగాటోర్నీకి ఈ జమైక చిరుత ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు. ప్రపంచంలో నే అత్యంత వేగవంతమైన అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కిన బోల్ట్.. తాజా బాధ్యతలతో ఆనందంగా ఉన్నట్లు వెల్లడించాడు. ‘ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌నకు అంబాసిడర్‌గా ఎంపికైనందుకు థ్రిల్లింగ్‌గా ఉంది. క్రికెట్‌కు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. కరీబియన్ దీవుల్లోని అథ్లెట్లలో అది ఒక అంతర్భాగం. ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌కు నా మద్దతు ఉంటుంది’.  అని బోల్ట్ పేర్కొన్నట్లు ఐసీసీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.