15 July, 2026 | 3:52 AM

‘పాండ్యా!.. నీ ఆటపై దృష్టి పెట్టు’

25-04-2024 12:38 AM

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కంటే ముందు తన ఆటపై దృష్టి సారిస్తే మంచిదని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా గత మూడు సీజన్లలో రోహిత్ కూడా ముంబైని విజేతగా నిలపలేకపోయాడని గుర్తుచేశాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ ముందు తన వ్యక్తిగత ప్రదర్శనపై దృష్టి సారిస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ముంబై సారథి పాండ్యాకు వీరూ కీలక సూచన చేశాడు.  ‘బ్యాటర్‌గా, బౌలర్‌గా పాండ్యాపై ఎలాంటి ఒత్తిడి లేదు. అతడే అలా భావిస్తున్నాడనిపిస్తుంది. రోహిత్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాకా అంచనాలు ఉండడం సహజమే. అయితే కెప్టెన్సీ పేరుతో అనవసర ఒత్తిడిని కొని తెచ్చుకుంటున్నాడు. ఈ సీజన్‌లో ముంబై ఆట అస్సలు బాగోలేదు’  అని పేర్కొన్నాడు.