బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్
24-06-2024 10:17 PM
హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. సోమవారం ఎయిర్‌పోర్టుకి ఓ ఆగంతకుడు బాంబ్ పెట్టినట్టు మెయిల్ చేశాడు. అలర్ట్ అయిన పోలీసులు, బాంబ్ స్కాడ్, డాగ్‌స్కాడ్ తనిఖీలు చేపట్టారు. ఎయిర్‌పోర్టు సహా పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి బాంబు లేదని నిర్ధారణకు వచ్చారు. మెయిల్ ఎవరు పంపారనే విషయంపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తరచూ రాజకీయ అగ్రనేతలు ఇక్కడి నుంచే ప్రయాణాలు చేస్తుంటారు. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.






