29 July, 2026 | 1:46 PM

నాటి ఎమర్జెన్సీపై నేటి మాటలు

25-06-2024 01:50 AM

చరిత్రలో ఓ మచ్చ

జూన్ 25.. ఈ రోజు భారత ప్రజాస్వామ్యంపై తుడుచుకోలేని మచ్చ పడి 50 ఏళ్లు పూర్తవుతుంది. అప్పుడు రాజ్యాంగంలో ప్రతిఅంశాన్ని విస్మరించారు. దేశంలో ఓ జైలులా మారింది. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అణచివేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని, మన సంప్రదాయాలను పరిరక్షించుకునే క్రమంలో మళ్లీ ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని దేశ ప్రజలంతా తీర్మానం చేయాలి. 

 -ప్రధాని నరేంద్ర మోదీ

ఇప్పుడున్నదీ ఎమర్జెన్సీలోనే

50 ఏళ్ల క్రితం జరిగిన ఘటనపై మోదీ నిరంతరం ప్రస్తావిస్తూనే ఉంటారా? ఇందిరా హయాంలో ఎమర్జెన్సీ విధిస్తున్నామని ప్రకటించి అమలు చేశారు. కానీ, ఇప్పుడు బీజేపీ పాలనలో ప్రకటించకుండానే ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలతో ప్రజలను మభ్యపెడుతూ ఎన్నాళ్లు అధికారంలో ఉంటారు? బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తోంది. 

 -కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే