కేంద్రమంత్రి ఖట్టర్ ను కలిసి సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని ఆయన నివాసంలో కలిశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎల్‌సీ మోడల్‌లో తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర ఖట్టర్ కు సీఎం విజ్ఞప్తి చేశారు. అలాగే నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రంలో తామ నిర్మించాలనుకున్న 25 లక్షల ఇళ్లలో 15 లక్షలు ఇళ్లు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని, వాటిని లబ్ధిదారులకు బీఎల్‌సీ పద్థతిలో నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. 2024-25 సంవత్సరానికి పీఎంఏవై (యూ) కింద మంజూరు చేసే ఇంటి నిర్మాణ వ్యయం నిధులు పెంచాలని కేంద్ర మంత్రి కోరారు. రాష్ట్రంలో తాము నిర్మించే ఇళ్లను పీఎంఏవై (యు) మార్గదర్శకాల ప్రకారం నిర్మిస్తామని, పీఎంఏవై (యూ) కింద ఇప్పటి వరకు తెలంగాణకు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి, రూ.2,390.58 కోట్లు గ్రాంటు కింద ప్రకటించారని సీఎం గుర్తు చేశారు. అయితే ఇందులో ఇప్పటి వరకు కేవలం రూ.1,605.70 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగతా నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.






