19 April, 2026 | 1:18 PM

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు

23-06-2025 01:32 AM

- రియాద్‌కు మళ్లింపు.. ప్రయాణికులు సురక్షితం

న్యూఢిల్లీ, జూన్ 22: బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ విమానాశ్రయం నుంచి శనివారం ఉదయం భారత రాజధాని ఢిల్లీకి బయల్దేరిన ఎయిర్ ఇండియా ఏఐ విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పైలెట్లు విమానాన్ని సౌదీ అరేబియా రాజధానిలోని రియాద్ విమానాశ్రయానికి మళ్లిం చారు.

అక్కడ ఫ్లుటై సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో భద్రతాపరమైన తనిఖీలు పూర్తయినట్లు ఎయిర్ ఇండి యా అధికారులు వెల్లడించారు. ప్రయాణికులందరికీ అక్కడ వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.