24 March, 2026 | 12:06 PM

జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు

24-03-2026 12:57 AM
  1. సిరిసిల్ల, ములుగు కోర్టులకు మెయిల్ పంపిన ఆగంతకులు
  2. బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీ

రాజన్న సిరిసిల్ల/ములుగు, మార్చి 23 (విజయక్రాంతి): ములుగు, సిరిసిల్ల జిల్లా కోర్టులకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు భవనం లో బాంబు అమర్చినట్లు తెలియజేస్తూ ఆగంతకులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరిక పంపినట్లు సమాచారం. ఈ సందేశం అం దుకున్న వెంటనే కోర్టు అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు.

సమాచారం అందు కున్న పోలీసులు తక్షణమే కోర్టు ప్రాంగణానికి చేరుకుని భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. జడ్జి, న్యాయవాదులు, సిబ్బంది, కేసుల కోసం వచ్చిన కక్షిదారులను వెంటనే బయటకు తరలించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లు రంగంలోకి దిగి కోర్టు భవనం, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతి మూలను పరిశీలిస్తూ అనుమానాస్పద వస్తువుల కోసం గాలించారు. ఈ-మెయిల్ పంపిన వ్యక్తులు ఎవరనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎలాంటి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.