10 June, 2026 | 2:57 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

ప్రాణం తీసిన 100 రూపాయలు!

24-03-2026 12:56 AM

మహబూబాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూర్య తండాకు చెందిన తేజవత్ కాంతి (55).. అజ్మీర బాన్కీ, నీలతో పక్క గ్రామంలో మిరప తోట ఏరడానికి కూలి పనికి వెళ్లింది. కూలి డబ్బులో వంద రూపాయలు తనకు రావాల్సి ఉందంటూ బానికి, నీలతో ఆదివారం సాయంత్రం గొడవపడ్డారు.

సోమవారం తెల్లవారుజామున ఇద్దరు మహిళల కుటుంబీకులు కాంతి ఇంటికి వచ్చి ఆమెపై దాడికి పాల్పడ్డారు. అవమానాన్ని తట్టుకోలేక కాంతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, బంధువులు మృతదేహాన్ని దాడికి పాల్పడిన వారి ఇంటి ముందు ఉంచి ధర్నాకు దిగారు. కాగా మృతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.