19 March, 2026 | 1:30 AM

బొమ్మ వెంకన్న సేవలు మరువలేనివి

19-03-2026 12:00 AM

మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్

కొత్తపల్లి, మార్చి 18 (విజయ క్రాంతి): బొమ్మ వెంకన్న సేవలు మరువరానివని తెలంగాణ  మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ అన్నారు. బుధవారం బొమ్మకల్ లోని మున్నూరు కాపు వసతి గృహంలో బొమ్మ వెంకటేశ్వర్ 7 వ వర్ధంతి  సందర్భంగా విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. 

తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు లను ఒక తాటిపైకి తీసుకువచ్చిన ఘనత బొమ్మ వెంకన్నకు దక్కుతుందని, ఆయన ఆశయాల ను కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘo రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్,   కుల బాంధవులు పాల్గొన్నారు.

నివాళులర్పించిన  అంజన్ కుమార్

కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ బొమ్మ వెంకటేశ్వర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ జిల్లా కు, ఈ రాష్ట్రానికి బొమ్మ వెంకన్న ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  కాం గ్రెస్ నాయకులు మధు, ఇమ్రాన్, ఆసిఫ్, దేవేందర్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.