19 March, 2026 | 1:35 AM

షెడ్యూల్డు కులాల నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం

19-03-2026 12:00 AM

పెద్దపల్లి, మార్చి- 18(విజయ క్రాంతి): రామగుండం నియోజకవర్గం నందు నివసించే షెడ్యూల్డు కులముల నిరుద్యోగ యువతీ,  యువకులకు  జిల్లా షెడ్యూల్డు కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం పెద్దపల్లి ద్వారా రామగుండము సబ్ రిజిస్ట్రేషన్ కా ర్యాలయం దగ్గర నిర్మింపబడిన దుకాణముల సముదాయం (అద్దె పై) లబ్దిదారుల ఎం పిక గురించి దరఖాస్తు ఆహ్వానిస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

షెడ్యూల్డు కులముల నిరుద్యోగ యువతీ,  యువకులు దుకాణముల సముదాయములో ఏదైనా స్వంత పెట్టుబడితో జీవనోపాది కొరకు వ్యాపారం ప్రారంభించేందుకు దరఖాస్తులు చేసుకోవాలని, సంబంధించిన దరఖాస్తు ఫారంలను  కలెక్టర్ కార్యాలయం పెద్దపల్లి నందు ఎస్.సి కార్పొరేషన్ కార్యాలయంలోదరఖాస్తులు సమర్పించాలని, జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.