8 August, 2026 | 10:39 PM

కాకతీయ పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు

08-08-2026 09:20 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇల్లందు పట్టణంలోని కాకతీయ పాఠశాలలో ఆషాఢ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ దండ రామచందర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతురాజు విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, విద్యార్థుల జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, విద్యార్థులు పండుగల ప్రాధాన్యతను తెలుసుకోవడం అవసరమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.