నేను చెప్పినప్పుడే యుద్ధం ముగుస్తుంది!
రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-వరల్డ్ మూవీ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ శనివారం సాయంత్రం విడుదలైంది. బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్‌లో మేకర్స్ ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్ దాదాపు నాలుగు నిమిషాలకు పైగా నిడివితో ఆకట్టుకునే విజువల్స్‌తో ఉంది.
ఇందులో పవర్ గేమ్, ప్రేమ, నమ్మకద్రోహం, క్రైమ్‌తోపాటు ముఖ్యంగా తండ్రీకొడుకుల మధ్య సాగే రక్తపాత యుద్ధం ప్రధానంగా చూపించారు. రాకింగ్ స్టార్ యశ్ మాస్ యాక్షన్ అవతార్, పవర్‌ఫుల్ ఎలివేషన్స్, డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ఊహించని విజువల్స్, అరాచకమైన యాక్షన్ సీక్వెన్సులు, థ్రిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. యాక్షన్ సీక్వెన్సుల మధ్య రాకింగ్ స్టార్ యశ్ తన ట్రేడ్‌మార్క్ స్టైల్, ఇంటెన్సిటీతో చెప్పిన కొన్ని కీలక ఇంగ్లీష్, హిందీ డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఈసారి యుద్ధం వేరు.. వారి కుతంత్రాలు వేరు.. అందరితో తలపడటం భారీ నష్టాన్ని తెస్తుంది.. మొండితనం వదిలేయ్’, ‘ఆశ వదిలేయ్ రాయా.. అంతా అయిపోయింది’,
‘నేను అయిపోయింది అని చెప్పినప్పుడే.. అది ముగుస్తుంది’, ‘అప్పటివరకు.. కాస్త పద్ధతిగా ఉండండి’, ‘టాక్సిక్ ప్రపంచంలోకి డాడీ అడుగుపెట్టాడు’ వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కే నారాయణ, యశ్ నిర్మించిన ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణీ వసంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో 40కి పైగా భాషల్లో థియేటర్ల ద్వారా విడుదల కానుందీ సినిమా. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని రాజీవ్ రవి అందించగా, సంగీతాన్ని రవి బస్రూర్, విశాల్ మిశ్రా, తనీష్ బాగ్చీ ఫహీమ్ అబ్దుల్లా, అర్‌స్ల్లాన్ నిజామీ అందించారు. ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్‌గా, జేజే పెర్రీ, అన్బరివ్, కేచా ఖంపక్డీ యాక్షన్ డైరెక్టర్లుగా, మోహన్ బీ కెరె, సందీప్ జీ కళా దర్శకులుగా వ్యవహరించారు.






