19 March, 2026 | 1:14 PM

Breaking News

మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •   రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం, డిప్యూటీ సీఎం ఉగాది శుభాకాంక్ష‌లు   •  

బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలి

19-07-2024 01:59 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 18 (విజయక్రాంతి): ఆషాఢ బోనాలను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఆయన ఉమ్మడి ఆలయాల కమిటీలకు చెక్కుల పంపిణీ చేసి మాట్లాడారు. భక్తులకు ఎలాం టి ఇబ్బందులు కలుగకుండా బోనాల ఏర్పా ట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజ సింహవాహిని బోనాలు, రంగం, భవిష్యవాణి బోనాలు, అంబారి ఊరేగింపులో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్, వెంకటాచారి, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 

ప్రజాపాలన సేవా కేంద్రం సందర్శన

నగరంలోని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేందాన్ని కలెక్టర్ అనుదీప్ ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఉదయం 10:30 గంటల నుంచి సాయం త్రం 5 వరకు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చుశామన్నారు. అనంతరం కేం ద్రాన్ని మంత్రి పొన్నం సందర్శించారు. పర్యటనలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రాములు, ఈడీఎం రజిత, ప్రజాపాలన వార్డు అధికారి బిందు పాల్గొన్నారు.