25 July, 2026 | 12:09 PM

నూతన ఎస్‌ఐ అనిల్‌కు ఘన సన్మానం

25-07-2026 11:38 AM

భిక్కనూర్, జూలై 25(విజయక్రాంతి): భిక్కనూర్ పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ అనిల్ను పెద్దమల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజలకు పారదర్శకమైన, న్యాయబద్ధమైన సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో విజయవంతంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్దమల్లారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు ఇటిక్యాల భాగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి, ఎల్లంరెడ్డి, ఉపసర్పంచ్ చైతన్య, కొండల్ రెడ్డి, వార్డు సభ్యులు వడ్ల శ్రీనివాస్, కంటి నర్సింలు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు పుట్ట బాలు, నాయకులు పిల్లి సంతోష్, బాబా గౌడ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.