1 July, 2026 | 11:09 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఓదెల మల్లన్నకు బోనం

30-07-2024 12:05 AM

రాష్ట్రమంతా బోనాల కళ కనపడుతోంది. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ పేరేదైనా.. మదిలోని భక్తితో అమ్మలక్కలంతా బోనాన్ని ఆ తల్లికి సమర్పిస్తున్నారు. ఈ తరుణంలో హీరోయిన్ తమన్నా కూడా ఆ ఆచారాన్ని అందుకున్నారు. సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న ‘ఓదెల 2’ సినిమాలో తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓదెల మల్లన్న గుడి సెట్‌ని నిర్మించారు. ఎనిమిది వందల మంది జూనియర్ ఆర్టిస్టులు భాగమైన ఈ షెడ్యూల్‌లో తమన్నా సహా ఇతర నటీనటులతో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

సినిమాలోనూ బోనాలకు సంబంధించిన సన్నివేశం ఉండగా.. అందుకోసం నిండుగా చీరకట్టి.. నెత్తిన బోనం పెట్టి నడిచివచ్చింది కథానాయిక తమన్నా. బోనాల సంబరాలను పురస్కరించుకొని సినిమాలోని ఈ పోస్టర్‌ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. వాస్తవిక ఘటనల ఆధారంగా రూపొందిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఉత్కంఠభరితమైన మరో కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగంలో నటించిన హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ఈ సినిమాలోనూ కనపడనున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్: సౌందర్‌రాజన్, ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్.