1 July, 2026 | 9:59 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

రాజాసాబ్ రాకకు ముహూర్తం ఫిక్స్

30-07-2024 12:05 AM

ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ‘బాహుబలి’, ‘సలార్’, ‘కల్కి’ వంటి భారీ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు, సీరియస్‌గా సాగే పాత్రల్లో ఆయన్ని చూసి సంతోషిస్తూనే.. ‘బుజ్జిగాడు’, ‘డార్లింగ్’ తరహాలో ప్రభాస్‌ని ఫన్ మోడ్‌లో మళ్లీ చూసేదెప్పుడా అని వారంతా ఎంతో కాలంగా వేచియున్నారు. వినోదాన్ని వండి వడ్డించడంలో తనదైన శైలి గల దర్శకుడు మారుతి చెవిన ఈ మాట పడింది కాబోలు.. ‘రాజాసాబ్’గా ప్రభాస్‌ని ఫాన్ ఇండియాకి చూపించేందుకు సన్నద్ధమయ్యారు. రొమాంటిక్ హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతన్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

సోమవారం ఈ సినిమాలోని ప్రభాస్ పాత్రకి సంబంధించిన గ్లింప్స్‌ని విడుదల చేసిన చిత్ర బృందం.. 2025, ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. గ్లింప్స్‌లో.. సైలిష్‌గా బైక్‌పై వచ్చి అద్దంలో చూసుకుని మురిసిపోయిన ప్రభాస్, తనకు తానే దిష్టి తీసుకోవడం తెరపైకి మునుపటి సందడిని తీసుకొస్తున్నారన్న భరోసానిచ్చింది. సినిమాలో ఇలాంటి గమ్మత్తులింకెన్ని ఉన్నాయో అన్న ఆసక్తిని రేపుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.