గెలుపే లక్ష్యంగా బొంది అరుణ వెంకట గౌడ్ ప్రచారం
06-02-2026 01:11 AM
తుప్రాన్ ౧౨వ వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి
తూప్రాన్, ఫిబ్రవరి 5(విజయక్రాంతి): తూప్రాన్ మున్సిపల్ పరిధి 12వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి బొంది అరుణ వెంకట గౌడ్ గడప గడపకు వెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. 12వ వార్డులో మహిళల ఆదరణతో పాటు యువకుల ఆదరణ పొందుతున్నారు. ఈసారి అవకాశం కల్పిస్తే 12వ వార్డు అభివృద్ధిని చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఇందులో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




