3 August, 2026 | 2:13 AM

‘సంక్షోభ కాలంలో విద్యారంగం’ పుస్తకావిష్కరణ

03-08-2026 01:07 AM

ముషీరాబాద్,ఆగస్టు 2 (విజయక్రాంతి): విద్యారంగంలో గత నాలుగు దశాబ్దాలుగా చోటుచేసుకున్న మార్పులు, ప్రభుత్వ విధానాలు, ప్రైవేటీకరణ ప్రభావంతో విద్యలో అ సమానతలు మరింత పెరిగాయని ప్రముఖ విద్యావేత్త ప్రొ. జి. హరగోపాల్ అన్నారు. ఆయన ప్రసంగాలు, వ్యాసాల సంకలనంగా రూపొందిన ’సంక్షోభ కాలంలో విద్యారంగం’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం కాట్రగడ్డ శ్రీనివాసరావు హాల్లో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్), పాలమూరు అధ్యయన వేదిక (పీఏవీ) సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రొ. హరగోపాల్ మాట్లాడుతూ  ప్రభుత్వాలు అమలు చేసిన విద్యా విధానాల కారణంగా ప్రభుత్వ విద్య బలహీనపడిందని,

కేజీ నుంచి పీజీ వరకు ప్రైవేటీకరణ విస్తరించిందన్నారు. సమాన విద్యావకాశాల కోసం కామన్ స్కూల్ విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రజాస్వామ్య విద్యా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పుస్తకాన్ని ప్రొ. వి.ఎస్. ప్రసాద్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎం. వెంకట్రాములు, ఎం. సోమయ్య, ఎం. రాఘవాచారి, ప్రొ. కె. చక్రధరరావు, ప్రొ. డి.ఎస్., డా. ఎం. వనమాల, కె. లక్ష్మీనారాయణ, ప్రొ. సూరేపల్లి సుజాత, మెట్టు రవీందర్, ఎం. గంగాధర్, రాజేంద్రబాబు అర్విణి, టి. లింగారెడ్డి, సి.హెచ్. అనిల్కుమార్, పి.బి. స్వామి తదితరులు పాల్గొన్నారు.