3 August, 2026 | 3:22 AM

రేపు ‘చలో బస్ భవన్’

03-08-2026 02:10 AM

ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): తమ దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారం కోసం మంగళవారం ‘చలో బస్ భవన్’ కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి వెల్లడించారు.

ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటికే మూడు పీఆర్సీల ఎరియర్స్ రావాల్సి ఉందన్నారు. రిటైర్డ్‌మెంట్ బెనిఫిట్స్ బకాయిలు వెంటనే విడుదల చేయడంతో పాటు తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అన్నిరకాల వైద్య చికిత్సలు అందించాలని డిమాండ్ చేశారు. 4వ తేదీన ఉదయం 10 గంటలకు బస్ భవన్ వద్ద నిర్వహించే చలో బస్సు భవన్ కార్యక్రమానికి రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలు నిచ్చారు. అదే విధంగా సూపర్‌లగ్జరీ బస్సుల్లోనూ రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయాణ అనుమతి ఇవ్వాలని కోరారు.