12 June, 2026 | 12:21 PM

Breaking News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •  

సరిహద్దుల్లేని.. అమ్మ ప్రేమ!

11-05-2025 12:00 AM

ప్రకృతిలో విశ్వజనీనమైన ప్రేమ ఏదైనా ఉందీ అంటే అది అమ్మ ప్రేమ ఒక్కటే! భూమ్యాకాశాలు ఉన్నంత వరకు ఆ అమ్మతనమే మనిషి ఉనికిని చాటుతున్నది. ఖండాలు, దేశాలు, మతాలు, జాతులు, సంస్కృతులు వేరైనా సరే.. కన్నబిడ్డల పట్ల చూపే అమ్మప్రేమలో మాత్రం తేడా ఉండదు. ఆమె ప్రేమకు సరిహద్దులు లేవు అంటున్నారు రొమానియా ఫోటోగ్రాఫర్ మిహేలా నోరోక్. మాతృత్వ మధుమరిమలోని జీవన రహస్యాన్ని తెలుసుకునేందుకు ఆమె అన్ని దేశాల్లోనూ తిరిగి.. తల్లీబిడ్డల బంధాన్ని తన కెమెరాలో బంధించారు.

‘అట్లాస్ ఆఫ్ బ్యూటీ’ అనే వెబ్‌సైట్‌లో ఆ చిత్రాలను పొందుపరిచారు. ‘మా నాన్న పెయింటర్, చిన్నప్పటి నుంచి రంగుల మధ్యే నేను పెరిగాను. పదహారవయేట నుంచే కెమెరా పట్టుకున్నా. బతుకడానికి రకరకాల ఉద్యోగాలు చేసినా సంతృప్తి లేదు నాకు. కొంత డబ్బు పోగుచేసుకుని ఆరేళ్లుగా ప్రపంచ పర్యటన చేస్తున్నా. అందులో భాగంగా దేశదేశాల్లోని తల్లీబిడ్డల బంధాన్ని ఫోటోల్లో బంధించా. నా కంటికి అన్నిచోట్లా అమ్మప్రేమలో ఎక్కువతక్కువలు కనిపించలేదు. అదే అమ్మలోని అద్భుతం’ అంటున్నది మిహేలా నోరోక్.