30 August, 2026 | 4:23 PM

సమసమాజ స్ధాపనకు 'జ్యోతి బాపూలే, అంబేద్కర్,గద్దర్' చేసిన కృషి ఆదర్శనీయం

30-08-2026 03:18 PM

అల్వాల్,ఆగస్టు 30,(విజయక్రాంతి): పాత ఆల్వాల్ అంబేద్కర్ నగర్ కాలనీలో ఆదివారం మహాత్మ జ్యోతి బాపూలే, బి.ఆర్.అంబే ద్కర్,పాటల ప్రవక్త గద్దర్ విగ్రహాల వద్ద 168వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితులుగా రిటైర్డ్ ఫై ర్ సర్వీస్ ఆఫీసర్(Retired Fire Service Officer), ఎస్సి వెల్ఫేర్ అసోసియేషన్  మాజీ రాష్ట్ర  నాయకులు ఎమ్.ఆర్.ప్రేమ్ కుమార్, ఎస్సి,ఎస్టీ, బిసి,ముస్లిం ఫ్రంట్ సాన హుల్లా ఖాన్, హజరై మాట్లాడారు. మహాత్మ జ్యోతి బాపూలే, బి.ఆర్.అంబేద్కర్, ప్రజా యుద్ధ నౌక గద్దర్  సమాజా నికి చేసిన సేవలను కొనియాడారు.  ఆ మహనీయులు సమ సమాజ స్ధాపనకు చేసిన సేవలు, కృషి ఆదర్శనీయమన్నారు.  ఆ మహానీయుల గురించి, సనాతన దర్మం ఏ విధంగా ప్రజలపై రుద్ద బడుతుంది,? రాజ్యాంగం ఎలా రక్షించు కోవాలి..? అనే అంశాలపై వారు మాట్లాడారు. ఈ కార్య క్రమంలో గద్దర్ అభిమా నుల సంఘం అధ్యక్షులు సి.ఎల్. యాద గిరి, జీ. రాజయ్య, మూర్తి, సాగర్, కే.శ్రీనివాస్, రేష్, సి. మహేందర్,చిత్తయ్య, హెచ్.ఎమ్.టి. రమేష్, నరసింహ ముదిరాజ్ తదితరులు  పాల్గొని నివాళులు అర్పించారు.