calender_icon.png 16 February, 2026 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిల్డ్రన్ హోమ్ నుంచి బాలుడు అదృశ్యం

16-02-2026 12:00:00 AM

మేడిపల్లి,ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): చిల్డ్రన్ హోమ్ నుండి బాలుడు అదృశ్యమైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమ్మఒడి చిల్డ్రన్ హోమ్ నుండి, గతంలో సైదాబాద్ ప్రభత్వ బాలల గృహం నుండి పారిపోయిన అక్షిత్ కుమార్ (12) అప్పట్లో మిస్సింగ్ కేసు కూడా నమోదు అయ్యింది.

ఆ తరువాత ఆ బాలుడిని మార్పి డి చేసి మేడిపల్లి లోని అమ్మ ఒడి వాలంటీర్ ఆర్గనైజేషన్ చిల్డ్రన్ హోమ్‌లో చేర్పించారు. ఈ నెల 13న ఆశ్రమం నుండి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయి తిరిగి రాలేదు. వలంటీర్ అరుణ్ కుమార్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి పోలీసులు తెలిపారు.