16-02-2026 12:00:00 AM
ఉత్సాహంగా పాల్గొన్న ఐదు వేల మంది మహిళలు
ముషీరాబాద్, ఫిబ్రవరి15 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం మద్దతు, ఫిట్ ఇండియా, స్పోరట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో జైడస్ పింకథాన్ హైదరాబాద్ ఆరో ఎడిషన్ ఆదివారం ఉద యం నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో 5 వేల మంది మహిళలతో అత్యంత ఉత్సాహంగా జరిగిందని పింకథాన్ వ్యవస్థాపకుడు మిలింద్ సోమన్ తెలిపారు. 3 కి.మీ విభాగంలో అమల కలపాల, 5 కి.మీ విభాగంలో మౌనిక కలపాల,10 కి.మీ. పరుగులో వడ్డే నవ్య విజేతలుగా నిలిచారని చెప్పారు. అల్ట్రా రన్నింగ్ విభాగంలోనూ మహిళలు తమ సత్తా చాటరని తెలిపారు.