18 August, 2026 | 2:13 AM

జల్సాల కోసం.. బైక్ చోరీలు చేస్తున్న 14 ఏళ్ల బాలుడు

18-08-2026 12:00 AM

మేడిపల్లి, ఆగస్టు 17 (విజయక్రాంతి): బైక్ చోరీలకు పాల్పడుతున్న 14 సంవత్సరాల మైనర్ బాలుడిని అరెస్ట్ చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసు కుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకా రం.. చెంగిచెర్లకు చెందిన సదరు మైనర్ బాలుడు (14) తన వ్యక్తిగత జలసాల కోసం గత నెల రోజులుగా మేడిపల్లి పరిసర ప్రాం తాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్నాడు.

దొంగిలించిన 4 ద్విచక్ర వాహ నాలను విక్రయించేందుకు ఒక బహిరంగ ప్రదేశంలో దాచిపెట్టాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న మేడిపల్లి క్రైమ్ టీమ్ రంగంలోకి దిగి బాలుడిని పట్టుకోవడంతో పాటు చోరీకి గురైన 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుంది. 

దర్యాప్తు పూర్తి చేసిన అనంతరం బాలుడికి చట్టప్రకారం నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణ నిమిత్తం బాల న్యాయ బోర్డు ముందు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. ఈ చోరీ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.