ఆస్తి కోసం భర్తను చంపిన భార్య
- ఈ నెలాఖరులో భర్త పదవీ విరమణ
- ఇంతలోనే రోకలితో కొట్టి చంపిన భార్య
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఘటన
హుస్నాబాద్, ఆగస్టు 17: భార్యాభర్తల మధ్య ఆస్తుల పంపకాల విషయంలో తలెత్తిన వివాదంలో భర్తను భార్య రోకలితో కొట్టి చంపిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో జరి గింది. హనుమాన్‌నగర్‌కు చెందిన కోటి వెంకటేశ్వర్లు (62), రాజమణి దంపతులు. వెంకటేశ్వర్లు ఆసిఫాబాద్‌లో కమర్షియల్ ట్యాక్స్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నా రు. ఈ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది.
రాజమణి హుస్నాబాద్ ప్రభు త్వ ఆసుపత్రిలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నది. ఇద్దరి మధ్య ఆస్తుల పంపకాల విషయమై ఆదివారం సాయంత్రం వివాదం మొదలైంది. మాటామాటా పెరగడంతో రాజమణి రోలుతో వెంకటేశ్వర్లు తలపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రై వేట్ ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే ఆయన మృతి చెం దినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి త మ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసిన పో లీసులు కుటుంబ కలహానికి దారితీసిన కారణాలు, ఘటనకు సంబం ధించిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.






