బాలుడు అదృశ్యం
22-12-2025 07:23 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): బాలుడు అదృశ్యం మైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జయప్రద కాలనీ చెంగిచెర్లలో నివసించే బీహార్ కు చెందిన మీనాదేవి కుమారుడు, రాజ్ కుమార్(09) గత నెలక్రితం ఇంటిముందు ఆడుకుంటూ తప్పి పోయి, ఇంటికి తిరిగి రాలేదని, బాలుని తల్లి మేడిపల్లి పోలీసుల కు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని, ఎవరికైనా బాలుడు కనిపించిన మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించాలని సిఐ గోవిందరెడ్డి తెలిపారు.






