22-12-2025 07:20:13 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ పాటలను చాటారు. 2025 -26 సంవత్సరానికి గాను నిర్మల్ జిల్లాలో ఈనెల 20,21 తేదీల్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ లో బెల్లంపల్లి పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొనీ పలు బహుమతులు సాధించారు. క్రీడా పోటీల వివరాలను పీడీ ఇన్‌చార్జ్ శ్రీ ఎం.డి. అజీజ్ ద్దీన్ ఆయన బృందం శ్రీ ఎం.డి. షోయబ్ పాషా (లెక్చరర్ – EEE), వి. శ్రీనివాస్, సావిత్రి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బాలుర విభాగం విజేతలు:
వాలీబాల్ – 1వ స్థానం
బ్యాడ్మింటన్ సింగిల్స్ – 1వ స్థానం
బ్యాడ్మింటన్ సింగిల్స్ – 2వ స్థానం
బ్యాడ్మింటన్ డబుల్స్ – 2వ స్థానం
షాట్‌పుట్ – 1వ స్థానం
100 మీటర్లు – 3వ స్థానం
200 మీటర్లు – 2వ స్థానం
4×100 మీటర్ల రిలే – 2వ స్థానం
చెస్ – 2వ స్థానం
ట్రిపుల్ జంప్ – 3వ స్థానం
బాలికల విభాగం విజేతలు:
వాలీబాల్ – 1వ స్థానం
కబడ్డీ – 2వ స్థానం
లాంగ్ జంప్ – 1వ స్థానం
ట్రిపుల్ జంప్ – 1వ స్థానం
జావెలిన్ త్రో – 1వ స్థానం
డిస్కస్ త్రో – 1వ స్థానం
4×400 మీటర్ల రిలే – 2వ స్థానం
4×100 మీటర్ల రిలే – 2వ స్థానం
400 మీటర్లు – 2వ స్థానం
800 మీటర్లు – 2వ స్థానం
షాట్‌పుట్ – 2వ స్థానం
టేబుల్ టెన్నిస్ సింగిల్స్ – 2వ స్థానం
టేబుల్ టెన్నిస్ డబుల్స్ – 2వ స్థానం
బ్యాడ్మింటన్ డబుల్స్ – 2వ స్థానం
1500 మీటర్లు – 3వ స్థానం
హైజంప్ – 3వ స్థానంలో నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడల్లో అద్భుతమైన ప్రతిభ పాటవాలను చాటినా విద్యార్థులను పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ దేవేందర్ రెడ్డి అభినందించారు.