మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ధీర
‘2వ గది’ సినిమాతో మంచి గుర్తింపు పొందిన అక్షర్ నాయుడు హీరోగా మరో కొత్త చిత్రం ‘ధీర’. తెలుగు టెలివిజన్ రంగంలో ఎన్నో విజయవంతమైన సీరియల్స్‌కు దర్శకత్వం వహించిన తోట గోపినాథ్ ఈ చిత్రాన్ని మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. గౌరీశంకర్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ముహూర్తం కార్యక్రమంతో ఈ సినిమా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా నిర్మాత పసుపులేటి గౌరిశంకర్ మీడియాతో మాట్లాడుతూ.. “ఇదొక శక్తిమంతమైన కథ. యాక్షన్, ఎమోషన్, గురు-శిష్య బంధం కలగలిపిన వినూత్న కథతో రూపొందిస్తున్నాం. కథపై పూర్తి నమ్మకం ఉంది. హీరో అక్షర్ నాయుడు మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం ఈ సినిమాకు ప్రధాన హైలైట్ అవుతుంది” అన్నారు. ‘ఆధారం’, ‘ఖైదు’, ‘2వ గది’ వంటి చిత్రాలకు సంగీతం అందించిన ఎస్‌ఎన్ నజీర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ధరణి కోట డైలాగ్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
గీత రచయితలు లక్ష్మణ్ గంగా, అంబట్ల రవి ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరిద్దరూ భావోద్వేగం, మాస్, క్లాస్ అన్నింటినీ కలిపిన పదాలతో పాటలకు ప్రాణం పోయగల ప్రతిభావంతులుగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. ఈ ఉభయుల సాహిత్యం.. సినిమా సంగీతానికి మరింత విలువను తీసుకురానుంది.
నిర్మాత పసుపులేటి గౌరీశంకర్ ఈ సినిమాలోని ఫైట్స్‌ను స్వయంగా పర్యవేక్షిస్తూ, సీనియర్ ఫైట్ మాస్టర్ రవితో కలిసి అత్యంత రియలిస్టిక్, పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ను రూపొందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా దేవి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.






