15 June, 2026 | 1:57 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

అవన్నీ కలిస్తే రేజర్!

19-04-2026 12:00 AM

ఫార్ములా కథలకు దూరంగా, కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన రవిబాబు, తన తాజాచిత్రం ‘రేజర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సురేశ్‌బాబు సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్, ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 8న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శనివారం థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్‌లో “.. తనకు కావాల్సిన వారిని కాపాడేందుకు కోపం, క్రోధం, కలహం, విధ్వంసం.. అన్నీ కలిసి ‘రేజర్’గా మారుతుంది” అనే డైలాగ్ ఒక డార్క్, ఫెరోషియస్ ప్రపంచాన్ని సూచిస్తోంది. ఈ కథలో రవిబాబు ఒక డాగ్ గ్రూమర్‌గా కనిపిస్తారు. ఒక చిన్న అమ్మాయిని కాపాడేం దుకు అతను ఎంతవరకు వెళ్తాడో చూపించే పాత్ర ఇది. ఈ చిత్రానికి చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ, ఎస్‌ఎస్ రాజేశ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సతీశ్ పొలుజు యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.