18 June, 2026 | 1:51 AM

దర్జాగా సిలిండర్ సరఫరా దందా

18-06-2026 12:43 AM
  1. గోదాంకు వెళితే రూ 10, ఇంటికి తెస్తే రూ.50 అదనం
  2. కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్న గ్యాస్ ఏజెన్సీలు 
  3. వేతనం తప్పించి వసూలు చేసుకోవాలంటూ సహకారం
  4. అటువైపే చూడని ఆ శాఖ అధికారులు
  5.  కొరత లేకున్నా.. గ్యాస్ దొరకడం లేదంటూ బుకాయింపు 
  6. తనిఖీలు చేపడతాం : మహబూబ్ నగర్ డీఎస్‌ఓ గంప శ్రీనివాస్

మహబూబ్ నగర్ టౌన్, జూన్ 17 : కార్మికుల కష్టం దోచుకోకూడదు.. పనికి తగ్గ వేతనం ఇవ్వాలి.. నిత్యం కార్మిక లోకం కోరుకుంటున్నప్పటికీ వారి ఆశలు ఆవిరిగానే మిగులుతున్నాయి. తక్కువ వేతనం ఇస్తూ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే కార్మికుల పొట్ట కొట్టి వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలంటూ పరోక్షంగా గ్యాస్ ఏజెన్సీల యాజమాన్యాలు ప్రోత్సహించడం విడ్డూరంగా ఉంది. ఎందుకు అదనంగా బస్సులు అడుగుతున్నారు అని ప్రశ్నించినప్పటికీ జీతం తక్కువగా ఉంటుంది వసూలు చేసుకోవాలంటూ కొందరు గ్యాస్ సరఫరా చేసే కార్మికులు చెబుతున్న మాట. 

 నోటి మాటలే.. అమలు జరగట్లే 

 గ్యాస్ సిలిండర్ సరఫరా నిర్దిష్ట పరిధిలో నిబంధనల మేరకు అదనంగా వసూలు చేయకుండా సరఫరా చేయవలసి ఉన్నప్పటికీ ఆ నిబంధనలు అమలుకు ఆమాడ దూరంలో ఉన్నాయి. ఇటీవల కాలంలో గ్యాస్ కొరత లేకున్నప్పటికీ ఉందంటూ పుకార్లు పుట్టించి వినియోగదారులకు తీర ఇబ్బందుల గురి చేసిన దాఖలాలు లేకపోలేదు. దీంతోపాటు గ్యాస్ సిలిండర్ దొరికితే చాలు అదనంగా ఎంతైనా ఇస్తాం అనే విధంగా గ్యాస్ నిర్వాహకులు వినియోగదారులకు ఆశ చూపిస్తూ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఒక సిలిండర్ రూ 997.50 ఉన్నప్పటికీ అదనంగా మొత్తం రూ 1050 వసూలు చేస్తూ అదనపు డబ్బులు కూడా నిబంధనల మేరకే అన్నట్టు వ్యవహరించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చేసేదేమీ లేక వినియోగదారులు ఎవరికి వారు అదనంగా డబ్బులు అప్పజెప్తున్నారు. గ్యాస్ సిలిండర్ తీసుకొని వారి గోదాం దగ్గరికి వెళితే అక్కడ కూడా అదనంగా రూ పది రూపాయలు అప్పగించాల్సిందే అంటూ గ్యాస్ నిర్వాహకులు హుకుం జారీ చేయడం పలువురని ఆవేదన గురిచేస్తుంది. ఇప్పటికైనా వీరి అదనపు వాసులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ఏ ఇంటి తలుపు తట్టిన అదనపు వసూలు..

 గ్యాస్ లీటర్ ధర కంటే అదనంగా వసూలు చేస్తున్నారని ఏ ఇంటి తలుపు తట్టిన వెంటనే చెప్పేస్తారు. ఈ విషయాలు అన్ని అధికారులకు తెలిసినప్పటికీ గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులకు ఆదేశాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు కార్యాలయాలకు పరిమితం కాకుండా కాస్త వినియోగదారులకు మేలు చేసేలా అవసరమైన చర్యలు ఎంతైనా తీసుకోవాల్సి ఉందని వినియోగదారులే కోరుతున్న మాట.

 తనిఖీలు చేపడతాం..

అదనంగా వసూలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూ డదు. నియమ నిబంధన ప్రకారం గ్యాస్ సల్ఫర్ వినియోగదారికి అప్పజెపాల్సిన బాధ్యత గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులకు ఉంటుంది. తనిఖీలు చేపడతాం ఎక్కడైనా ఆధారంగా వసూలు చేసినట్లు రుజువైతే వారిపై చర్యలు తీసుకుంటాం.

గంప శ్రీనివాస్, డిఎస్‌ఓ, 

మహబూబ్ నగర్