18 June, 2026 | 2:47 AM

సీతమ్మే లంకాదహనం చేస్తే..!

18-06-2026 01:51 AM

ఆలియా భట్ ప్రధాన పాత్రధారిగా, శర్వారి వాఘ్ కీలక పాత్రలో యశ్‌రాజ్ ఫిలమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘ఆల్ఫా’. శివ్ రావలీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బాబీ డియోల్, అనిల్ కపూర్ ముఖ్యపాత్రల్లో అలరించనున్నారు. బుధవారం మేకర్స్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. హై యాక్షన్ ఎలిమెంట్స్‌తోపాటు సూపర్ ఫన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా అలరించనుందని తెలుస్తోంది. ‘సీత లంకాదహనం చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా’ అంటూ ఆలియా చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇక ఈ చిత్రంలో హృతిక్ రోషన్ అతిథి పాత్రలో అలరించనున్నట్టు తెలుస్తోంది.. ట్రైలర్ చివరలో అతని కళ్లను మాత్రమే చూపించడం ద్వారా సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. ఈ సినిమా జూలై 3న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.