17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

భక్తులకు మంథని పట్టణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు

15-02-2026 06:08 PM

మంథని,(విజయక్రాంతి): మహాశివరాత్రి పురస్కరించుకొని మంథని బస్ డిపో సమీపంలో పవిత్ర గోదావరి నదికి వెళ్లే భక్తుల కోసం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆశీస్సులతో మంథని పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు 10వ వార్డు కౌన్సిలర్ పెంటరి రాజు, యూత్ నాయకులు పెరుగు తేజ, మారుతి గౌడ్ అధ్వర్యంలో భక్తులకు అల్పాహారం  ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ 5,  11వ వార్డు కౌన్సిలర్స్ ముస్కుల సయేందర్ రెడ్డి,  ఓడ్నాల శ్రీనివాస్, జిల్లా ఆర్టీఏ మెంబర్ మంథని సురేష్, జిల్లా మీడియా ఇంచార్జీ అరెల్లి కిరణ్ మాట్లాడుతూ... మంథని నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

పట్టణ యూత్ అధ్యక్షులు పెంటరి రాజు  బృందం గత మూడు సంవత్సరాల నుండి అల్పాహార వితరణ చేయడం జరుగుతుందని, ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఆ పరమశివుని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని అందరు సుఖసంతోషాలతో పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరారు. మంత్రి శ్రీధర్ బాబు  మంథని ప్రాంతాన్ని అభివృద్ధి తీసుకురావడానికి వారు ఎంతో కృషి చేస్తున్నారని వారికి ఆ పరమశివుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరారు.

ఈ ప్రాంత అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో 13 సీట్లగాను 11 మంది సభ్యులను గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాతకు బహుమతి ఇవ్వడం జరిగిందని, రానున్న ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో కూడా ఇదేవిధంగా ప్రజలు వారందరిని  ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పట్టణ యూత్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.