15 April, 2026 | 1:56 PM

కాంగ్రెస్‌లో చేరలేదు.. బీఆర్‌ఎస్‌లో ఉన్నాం

15-02-2026 05:29 PM

అసత్య ప్రచారాలు నమ్మకండి

బిఆర్ఎస్ కౌన్సిలర్లు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు నలుగురు కాంగ్రెస్లో చేరారంటూ ఆదివారం పలు ఛానల్లో కథనాలు వెలువడడంతో జిల్లా బీఆర్ఎస్ నాయకులు స్పందించారు. కాంగ్రెస్లో చేరారని పేర్కొన్న బిఆర్ఎస్ కౌన్సిలర్లు పిట్ల వేణుగోపాల్, గిరిగట్టి లక్ష్మీనారాయణ, గేరుగంటి స్వప్న, అజీజ్ లు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జిల్లా బిఆర్ ఎస్ అధ్యక్షుడు ముజీబుద్దిన్ లు మాట్లాడారు.

కాంగ్రెస్లో చేరలేదని గిట్టని వారు తప్పుడు ప్రచారాలు చేశారని వారు పేర్కొన్నారు. టిఆర్ఎస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కాంగ్రెస్లో చేరలేదని పేర్కొన్నారు.బిఆర్ఎస్ నేతలతోనే కలిసి ఉన్నామని తెలిపారు. దీంతో కాంగ్రెస్లో నలుగురు బిఆర్ఎస్ కౌన్సిలర్లు చేరా రూ అనే ప్రచారాన్ని టిఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు ఖండించారు. తాము కారు గుర్తు తో గెలిచామని అధిష్టానం నిర్ణయం మేరకే నడుచుకుంటామని వారు పేర్కొన్నారు.