24 June, 2026 | 2:43 PM

Breaking News

బుధవారంపేటలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం   •   జోరుగా జీరోలో చల్లని పానీయ వ్యాపారం   •   అర్హులైన పేదలందరికీ ఇళ్లు   •   రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'   •   'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •  

బ్రీత్ ఈజీ.. రన్ ఫ్రీ

04-05-2026 02:02 AM

ఆరోగ్యకరమైన జీవనశైలి కోసమే మెడికవర్ కార్యక్రమం

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): ఆరోగ్యకరమైన జీవనశైలి, శ్వాస సంబంధిత వ్యాధులపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా మెడికవర్ ఆసుపత్రి, హెచ్‌ఐ టెక్ సిటీ పల్మనాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘బ్రీత్ ఈజీ, రన్ ఫ్రీ’ 5కెను నిర్వహించింది. ఈ రన్‌లో వైద్యులు, సిబ్బంది, ఫిట్‌నెస్, సాధారణ ప్రజలు 250మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ హరిరాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత లంగ్ స్క్రీనింగ్ ప్యాకేజీని ప్రారంభించారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్యం, జీవనశైలి మార్పులు ఊపిరితిత్తుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఇటువంటి సామాజిక అవగాహన కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. 

డాక్టర్ రఘుకాంత్ మాట్లాడుతూ.. సాధారణంగా కనిపించే జలుబు, దగ్గు కూడా అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తున్నాయన్నారు. వీటిని నిర్లక్ష్యం చేయొద్దన్నారు. డాక్టర్ రాజ మనోహర్ మాట్లాడుతూ.. చిన్నరుగ్మతలను ప్రారంభదశలోనే గుర్తిస్తే చికిత్స సులభమై సంక్లిష్టతలు తగ్గుతాయన్నారు. ప్రజలు శ్వాస ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరమని డాక్టర్ మేఘన సుభాష్ స్పష్టం చేశారు.