24 June, 2026 | 3:43 PM

జోరుగా జీరోలో చల్లని పానీయ వ్యాపారం

24-06-2026 02:40 PM

పక్క రాష్ట్రం నుండి రవాణా... 

బోథ్, జూన్ 24 (విజయక్రాంతి): పోరుగున ఉన్న మహారాష్ట్ర నుండి సరిహద్దుల మీదుగా బజార్హత్నూర్ సోనాల మండలాలకు గుట్టు చప్పుడు కాకుండా చేరుకుంటున్నది. స్థానికంగా ఉన్న కొంతమంది వ్యాపారులు సరిహద్దుల మీదుగా (గన్ పూర్ చెక్ పోస్ట్) అక్రమ రవాణా కొనసాగుతున్నది. మహారాష్ట్రలోని బోధిడి కిన్వాట్ ల నుండి ఈ అక్రమ వ్యాపారం జోరుగా కొనసాగుతున్నది.. 

జిఎస్టి కి ఎగనామం పెట్టి

మహారాష్ట్ర నుండి తీసుకువచ్చిన కూల్ డ్రింక్స్ కు జీఎస్టీ లేకుండానే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చేరుతుండడంతో తక్కువ ధరల్లో వస్తుందని గుర్తు చప్పుడు కాకుండా దిగుమతి చేసుకుంటున్నారు. సోనాల బజార్హత్నూర్ మండల కేంద్రాలలో కొంతమంది వ్యాపారులు కూల్డ్రింక్స్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. సరిహద్దు చెక్ పోస్ట్ ల పైన పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తే అక్రమ వ్యాపారానికి అడ్డుపడే ఆస్కారం ఉంది.