రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'
24-06-2026 02:35 PM
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ(Sathupalli constituency) బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పాల్గొన్నారు. సర్ పై బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి నమ్మించి గద్దెనెక్కినంక రైతులను మోసం చేసిన రైతు ద్రోహి రేవంత్ అని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ కు గెలుపు కొత్త కాదు.. ఓటమీ కొత్త కాదని సూచించారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు.. కానీ అభివృద్ధి లేదని విమర్శించారు. 40 శాతమే రైతు రుణమాఫీ జరిగింది.. ఇంకా 60 శాతం జరగలేదని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి అనే ఒకే మాట వినిపిస్తోందని కేటీఆర్ సూచించారు.






